Vikarabad: మర్పల్లి మండలం దగ్గర ఆర్టీసీ బస్సు బోల్తా
Vikarabad: 15 మందికి గాయాలు.. ముగ్గురి పరిస్థితి విషమం
Representational image
Vikarabad: వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం కల్కోడ గేట్ సమీపంలో ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 15 మంది గాయాల పాలయ్యారు.. వీరిలో నలుగురికి తీవ్రంగా గాయాలు కాగా అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా మారింది. ఘటన జరిగిన వెంటనే గాయాలైన వారిని మర్పల్లి ఆస్పత్రికి తరలించారు. సంగారెడ్డి డిపోకు చెందిన బస్సు తాండూర్ నుంచి సంగారెడ్డి వెళ్తుండగా అదుపు తప్పి బోల్తా కొట్టింది.
Next Story




