ఐపీఎస్ ఆఫీస‌ర్ ప్రవీణ్‌కుమార్ దారెటు.. 15 ఏళ్ల పక్కా ప్లానింగ్‌తో ఎంట్రీ ఇవ్వబోతున్నారా?

RS Praveen Kumar Political Entry Soon
x

ఐపీఎస్ ఆఫీస‌ర్ ప్రవీణ్‌కుమార్ దారెటు.. 15 ఏళ్ల పక్కా ప్లానింగ్‌తో ఎంట్రీ ఇవ్వబోతున్నారా?

Highlights

RS Praveen Kumar: ఆ అధికారి పొలిటికల్ ఎంట్రీ ఖాయమా? ఆరేళ్లు పదవికాలం ఉన్నా ఉన్నపళంగా ఎందుకు వీఆర్ఎస్‌ తీసుకున్నారు?

RS Praveen Kumar: ఆ అధికారి పొలిటికల్ ఎంట్రీ ఖాయమా? ఆరేళ్లు పదవికాలం ఉన్నా ఉన్నపళంగా ఎందుకు వీఆర్ఎస్‌ తీసుకున్నారు? పదవీ లేకుండా హోదా లేకుండా ప్రజాసేవ సాధ్యమా? ఇంతకీ ఆ ఐపీఎస్ ఆఫీసర్ ఏ రాజకీయ పార్టీ వైపు అడుగులు వేయబోతున్నారు? అతనితో పాటు ఇంకెంతమంది అధికారులు కలిసొస్తారు?

దిస్ ఈజ్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్. మావోయిస్టులతో చెలిమి చేసి వారిని లొంగిపోయేలా చేసిన ఆఫీసర్‌. కరీంనగర్ జిల్లాలో జనశక్తి నక్సల్ వ్యవస్థ ఉనికిని దెబ్బతీశారు. నక్సలైట్ల వైపు వెళ్లే వారి కుటుంబాల వద్దకు వెళ్లి జీవితాల గురించి కౌన్సిలింగ్ ఇస్తూ అనేక మందిని జన జీవన స్రవంతిలో కలిసేలా చేశారు. ప్రవీణ్‌కుమార్‌ కెరియర్‌ అంతా వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలోనే సాగింది. ఆ తర్వాత యూనిఫామ్‌తో కాకుండా ఎస్సీ గురుకుల విద్యా సంస్థలకు సేవ చేయాలని అనుకొని 2013లో సాంఘీక సంక్షేమ గురుకులాల సంస్థ కార్యదర్శిగా బాద్యతలు చేపట్టారు. దాదాపు ఐదేళ్లుగా అదే సంస్థలో పనిచేస్తూ దళిత గురుకుల వ్యవస్థను పటిష్టం చేశారు. స్వేరోస్ అనే స్వచ్ఛంద సంఘం పెట్టి సమాంతర వ్యవస్థను నడిపిస్తున్నారన్న అభియోగాలను ఎదుర్కొన్నారు.

అలాంటి అధికారి అనూహ్యంగా ఎందుకు రాజీనామా చేశారన్నదే ఇప్పుడు హాట్‌టాపిక్‌. ఇంకో ఆరేళ్ల సర్వీస్ ఉండగానే ఖాకీ కొలువుకు ఎందుకు గుడ్‌బై చెప్పారన్న చర్చ మొదలైంది. ప్రభుత్వ విదానాలకు వ్యతిరేకంగా ఆయన వీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నారని కొందరు ఓపెన్‌గానే మాట్లాడుకుంటున్నారు. కొన్ని అంశాల్లో ప్రభుత్వంతో పడిరాకపోవడం, ప్రవీణ్ ఒంటెద్దు పోకడలపై సర్కారు గుర్రుగా ఉండటం కూడా వీఆర్‌ఎస్‌కు కారణంగా చెప్పుకుంటున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ దళిత బంధు ప్రకటించిన 24 గంట్లలోనే ప్రవీణ్‌కుమార్ రాజీనామా చేయడం దళిత అధికారుల్లో, రాజకీయవర్గాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ఈ టైంలో ప్రవీణ్ విఆర్ఎస్ తీసుకోవడం ఏంటి అని ఇంటెలిజెన్స్‌ వర్గాలూ ఆరా తీస్తున్నాయి.

ఇదంతా సరే. మరిప్పుడు ఐపీఎస్ ఆఫీస‌ర్ ప్రవీణ్‌కుమార్ దారెటు? రాజకీయంగా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? అనేది ఇప్పుడు లెటెస్ట్ డిస్కషన్. ప్రవీణ్ ప్రజా సేవలో ఉంటారట. అంటే ఆయన పొలిటికల్ ఎంట్రీ చేస్తారని ఆయనే ఒప్పకున్నారు. అయితే ఏదైనా పార్టీలోకి వెళ్తారా కొత్తగా పార్టీని వెతుక్కుంటారా అనే చర్చ మొదలైంది. అయితే ప్రవీణ్ పొలిటికల్ ఎంట్రీ నిర్ణయం ఇప్పటిదీ కాదట. ఏడాది, రెండేళ్లు అని కాకుండా 15 ఏళ్ల పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్లాల‌ని భావిస్తున్నారట. ఇక్కడే మరో మాట కూడా వినిపిస్తోంది. ప్రవీణ్ కుమార్ బీఎస్పీతో క‌లిసి న‌డిచేందుకు సిద్ధమ‌వుతున్నారని! తెలంగాణలో బీఎస్పీ ఎక్కడ పోటీ చేసినా 2 శాతం ఓట్లు పడుతున్నాయి. 2014 ఎన్నికల్లో నిర్మల్ నుంచి ఇంద్రకరణ్‌రెడ్డి, కాగజ్‌నగర్‌ నుంచి కోనేరు కోనప్ప బీఎస్పీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఇది గ్రహించిన ప్రవీణ్‌కుమార్‌ ఆ పార్టీకి తాను ప్రాతినిధ్యం వ‌హిస్తే మ‌రింత బ‌లం రావొచ్చని ఆపై చక్రం తిప్పొచ్చని అంచనా వేస్తున్నారట.

రాజకీయ ప్రవేశంపై ఆరు నెలల నుంచి కసరత్తు చేస్తున్న ప్రవీణ్‌కుమార్‌ యాక్టివ్‌గా ఉన్న పార్టీల్లోనే ఏదో ఒక దానిలో చేరితే ఎలా ఉంటుంద‌న్న ఆలోచ‌న కూడా చేశారట. కానీ త‌న సిద్ధాంతాల‌కు ఏదీ స‌రిపోయేలా లేద‌న్న అంచనాకు వచ్చారట. ఏమైనా దీర్ఘకాల ల‌క్ష్యంతో బ‌య‌ల్దేరుతున్న ప్రవీణ్‌కుమార్‌ అన్ని సామాజిక వర్గాల‌ను కలుపుకొని వెళ్లేందుకు సిద్ధమవుతున్నార‌ని స‌మాచారం. ఈ క్రమంలో తీన్మార్ మ‌ల్లన్న లాంటి వాళ్లని ఎన్నికల సమయం వరకు ఏకం చేయాలని ప్లాన్‌తో ఉన్నట్టుగా తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories