RS Praveen Kumar: కేసీఆర్‌తో మరోసారి సమావేశమైన ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్

RS Praveen Kumar: లోక్‌సభ స్థానాలపై కేసీఆర్‌తో రాంజీ గౌతమ్, ఆర్ఎస్.ప్రవీణ్ చర్చలు

Shashank Gullapelli
Published on: 13 March 2024 7:40 PM IST
RS Praveen Kumar Met With KCR Once Again
X

RS Praveen Kumar: కేసీఆర్‌తో మరోసారి సమావేశమైన ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్

RS Praveen Kumar: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసానికి బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్ రాంజీ గౌతమ్, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్ ప్రవీణ్‌కుమార్ వెళ్లారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇరు పార్టీలు సంయుక్తంగా పోటీ చేయనున్నట్లు ప్రకటించిన దృష్ట్యా.. సీట్ల సర్దుబాటుపై ఇరు పార్టీల నేతలు ఓ క్లారిటీకి రానున్నారు. ఏ పార్టీ ఏయే లోక్‌సభ స్థానంలో పోటీ చేస్తుందనే అంశంపై ఈ సమావేశంలో స్పష్టత రానుంది. మరో వైపు లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడిగా అవలంభించాల్సిన రాజకీయ వ్యూహాలు, భవిష్యత్ కార్యాచరణపై ఇరుపార్టీల నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. నాగర్‌కర్నూల్, ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాలను బీఎస్పీ కోరినట్లు సమాచారం. కాసేపట్లో బీఆర్ఎస్, బీఎస్పీ పార్టీల జాయింట్ ప్రెస్‌మీట్ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story