RS Praveen Kumar: ఇవాళ బహుజన సమాజ్ పార్టీలోకి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌

RS Praveen Kumar: అధికారికంగా పార్టీలో చేరనున్న మాజీ ఐపీఎస్ * సాయంత్రం 4 గంటలకు నల్గొండలో రాజ్యాధికార సంకల్పసభ

Sandeep Eggoju
Updated on: 8 Aug 2021 2:48 PM IST
RS Praveen Kumar Going to Join in Bahujan Samaj Party Today
X
బీఎస్పీ లో చేరనున్న మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ (ఫైల్ ఇమేజ్)

RS Praveen Kumar: మాజీ ఐపీఎస్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ‎ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు బీఎస్పీ పార్టీలో అధికారికంగా చేరుతున్నారు. నల్గొండలో ఏర్పాటు చేస్తున్న రాజ్యాధికార సంకల్ప సభలో ప్రవీణ్ బీఎస్పీ నాయకుల సమక్షంలో పార్టీలో చేరతారు. ఈ బహిరంగసభకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. సభకోసం బీఎస్పీ రాష్ట్ర నాయకులు, స్వేరో ప్రతినిధులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు.

మాజీ ఐపీఎస్‌ ఆర్.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌కౌంటర్‌ స్పెష్టలిస్ట్‌గా పేరు తెచ్చుకున్నారు. ప్రభుత్వ గురుకులాల్లో మంచి పట్టు సాధించి ఎవ్వరు ఊహించని విధంగా రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే తాను ఏ రాజకీయ పార్టీలో చేరట్లేదని బలహీన వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండటానికే పదవికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story