RS Praveen Kumar: సోషల్‌మీడియాలో రూమర్స్‌పై ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ క్లారిటీ

RS Praveen Kumar: చివరిశ్వాస వరకు సామాజిక న్యాయం, స్వేచ్ఛ వైపే ప్రయాణం

Shekhar G
Published on: 5 March 2024 2:59 PM IST
RS Praveen Kumar Clarity on Rumours on Social Media
X

RS Praveen Kumar: సోషల్‌మీడియాలో రూమర్స్‌పై ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ క్లారిటీ

RS Praveen Kumar: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని, త్వరలోనే పూర్తిగా పాలిటిక్స్ నుంచి తప్పుకుంటున్నారనే వార్తలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ స్పందించి క్లారిటీ ఇచ్చారు.

తెలంగాణ ఎన్నికలకు ముందు ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా, సోషల్ మీడియా వేదికగా, లేదా డైరెక్ట్‌గా వెళ్లి స్పందించే ఆర్ఎస్పీ.. ఓటమి తర్వాత కనుమరుగయ్యారు. త‌న పై వ‌స్తున్న వదంతుల‌పై ఆర్ఎస్పీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన రాజకీయ ప్రస్థానంపై వస్తున్న ఎలాంటి వదంతులు నమ్మకండంటూ ట్వీట్ చేశారు. తన చివరి శ్వాస వరకు సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం దిశ వైపే నా ప్రయాణం కొనసాగుతుందని ట్విట్టర్‌లో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ రాసుకొచ్చారు.


Shekhar G

Shekhar G

Next Story