Hetero Pharma: ఐటీ దాడుల్లో విస్తుపోయే తీరులో హెటిరో సంస్థ బ్లాక్ మనీ
![](https://assets.hmtvlive.com/h-upload/uid/nullLMiEH58Moz5Ad7STQMMSalyKnAevq5mw9441802.jpg)
![Rs 550 cr Income Detected in IT Raids on Hetero Pharma Rs 550 cr Income Detected in IT Raids on Hetero Pharma](https://assets.hmtvlive.com/h-upload/2021/10/11/324864-hetero.webp)
Hetero Pharma: ఐటీ దాడుల్లో విస్తుపోయే తీరులో హెటిరో సంస్థ బ్లాక్ మనీ
Hetero Pharma: హెటిరో సంస్థలో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.
Hetero Pharma: హెటిరో సంస్థలో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో హెటిరో సంస్థ డ్రగ్స్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సోదాల్లో భాగంగా 550 కోట్ల రూపాయల బ్లాక్ మనీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. కొన్నిరోజుల క్రితం ఇదే సంస్థలో దాడులు నిర్వహించిన అధికారులు 142 కోట్ల రూపాయలను సీజ్ చేశారు. ఇప్పుడు మరిన్ని కోట్ల రూపాయల బ్లాక్ మనీని గుర్తించారు.
వందల కొద్దీ అట్టపెట్టేల్లో సంస్థ నగదు దాచిపెట్టినట్లు తెలుస్తోంది. చిన్నచిన్న అపార్టుమెంటుల్లో ఫ్లాట్లను కొని డబ్బు దాచినట్లు గుర్తించారు. మెడిసిన్ నిల్వపేరుతో అట్టపెట్టెల్లో కరెన్సీ కట్టలు దాచింది హెటిరో సంస్థ. ఒక్కో అల్మారాలో 5 కోట్ల రూపాయలను దాచిపెట్టినట్లు అధికారులు గుర్తించారు. అయితే డబ్బును లెక్కింపునకే రెండురోజుల సమయం పట్టిందన్నారు.
![](/images/logo.png)
About
![footer-logo](/images/logo.png)
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire