Dalit Bandhu: ఆ నాలుగు మండ‌లాల‌కు ద‌ళిత‌బంధు నిధులు విడుద‌ల‌

Dalit Bandhu: సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం...

Arun Chilukuri
Published on: 21 Dec 2021 9:00 PM IST
RS 250 cr Allocated to Four Mandals for Dalit Bandhu
X

Dalit Bandhu: ఆ నాలుగు మండ‌లాల‌కు ద‌ళిత‌బంధు నిధులు విడుద‌ల‌

Dalit Bandhu: సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం అమలులో భాగంగా రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాలకు 250 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గం చింతకాని మండలంలో దళితబందు అమలు కోసం అత్యధికంగా వంద కోట్లు నిధులు మంజూరు చేయగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలానికి 50 కోట్లు.

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం చారగొండ మండలానికి 50 కోట్లు, కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలో నిజాంసాగర్ మండలానికి 50 కోట్లు చొప్పున నిధులు విడుదల చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఆయా జిల్లాల కలెక్టర్ల ఖాతాల్లో ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈ నిధులు జమ చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story