Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో మరోసారి కత్తిపోట్ల కలకలం

Hyderabad: చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడిషీటర్ దారుణ హత్య * కత్తులతో పొడిచి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు

Sandeep Eggoju
Published on: 17 July 2021 11:26 AM IST
Rowdy Sheeter Death Case Issue in Hyderabad Old City
X

Representational Image

Hyderabad: పాతబస్తీలో మరోసారి కత్తిపోట్లు కలకలం రేపాయి. చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముస్తాక్ అలియాస్ ముస్తాక్ డాన్ అనే రౌడీషీటర్‌ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పరారయ్యారు. కత్తులతో దారుణంగా పొడిచి చంపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. హత్య పై కేసు నమోదు చేశామని, నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. రెక్కీ నిర్వహించి హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story