Nizamabad: తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో భారీ చోరీ.. 3 కోట్ల విలువైన..

Bank Theft: నిజామాబాద్‌ జిల్లా బుస్సాపూర్‌లో దొంగలు రెచ్చిపోయారు.

Arun Chilukuri
Updated on: 4 July 2022 4:52 PM IST
Robbery in Telangana Grameena Bank in Bussapur
X

Nizamabad: తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో భారీ చోరీ.. 3 కోట్ల విలువైన..

Bank Theft: నిజామాబాద్‌ జిల్లా బుస్సాపూర్‌లో దొంగలు రెచ్చిపోయారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో భారీ చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి షట్టర్‌ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు గ్యాస్‌కట్టర్‌తో లాకర్‌ను ధ్వంసం చేశారు. లాకర్‌లో ఉన్న 3 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో పాటు ఏడు లక్షల 30వేల నగదు అపహరించారు. అయితే చోరీకి గురైన బంగారు ఆభరణాలు రైతులు తాకట్టు పెట్టినవిగా బ్యాంక్‌ అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనలో బ్యాంక్‌ ఫైల్స్‌ కూడా కాలిపోయాయని వారు అంటున్నారు. బ్యాంక్‌ అధికారుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్‌ టీం ఆధారాలు సేకరిస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story