Top
logo

పెళ్లింట్లో భారీ చోరీ : 200 తులాల బంగారం మాయం

పెళ్లింట్లో భారీ చోరీ : 200 తులాల బంగారం మాయం
X
Highlights

మహబూబ్‌నగర్‌ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. పెళ్లి జరగాల్సిన ఇంటిని టార్గెట్‌ చేశారు. అందరూ నిద్రిస్తున్న...

మహబూబ్‌నగర్‌ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. పెళ్లి జరగాల్సిన ఇంటిని టార్గెట్‌ చేశారు. అందరూ నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి చొరబడి సుమారు 2 వందల తులాల బంగారు ఆభరణాలతో పాటు 6 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. మిడ్జిల్‌ మండలం బోయిన్‌పల్లిలో వెలుగుచూసిన ఈ ఘటనతో స్థానికులంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. బోయిన్‌పల్లికి చెందిన ఇంద్రారెడ్డి ఇంట్లో శుక్రవారం రాత్రి దొంగలు పడ్డారు. తన కుమారుడి వివాహం కోసం దాచిపెట్టిన నగలతో పాటు కుటుంబసభ్యుల ఆభరణాలను దొంగిలించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Web TitleRobbery in Mahabubnagar district
Next Story