అధ్వాన్నంగా ములుగు జిల్లాలోని అంతర్గత రోడ్లు

Mulugu District: భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు

Jyothi
Published on: 20 July 2022 7:59 AM IST
Roads Damaged By Heavy Rains
X

అధ్వాన్నంగా ములుగు జిల్లాలోని అంతర్గత రోడ్లు

Mulugu District: గతవారం రోజులుగా కురిసిన ఎడతెరిపిలేని వర్షాలతో ములుగు జిల్లాలోని అంతర్గత రోడ్లు మరింత అధ్వాన్నంగా మరాయి. ముఖ్యంగా మంగపేట నుంచి హన్మకొండకు వెళ్లే ప్రధానరహదారి భారీగా గోతులు ఏర్పడి ప్రమాదకరంగా మారింది. ఇక మారుమూల గ్రామాల్లోకి కనీసం వెళ్లే పరిస్థితి కూడా లేకుండిపూర్తిగా బురదతో పేరుకుపోయాయి. మరీ ముఖ్యంగా జీడివాగు లోలెవల్ కాజ్వేపై పెద్దపెద్ద గోతులు ఏర్పడి ఇనుప తీగలు బయటకు రావడంతో ఆరూట్లో వెళ్లే వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. ఇక వరద తాకిడికి బీసీ హాస్టల్ సమీపంలోని ‎ఓ కల్వర్టు గోడ కూలిపోగా, మరోవైపు గోడ పక్కనే పెద్దపెద్ద గోతులుఏర్పడ్డాయి. అధికారులు తాత్కాలిక చర్యలు చేపట్టినప్పటికీ ఈ రోడ్డుపై ప్రయాణం అంటే స్థానికులు జంకుతున్నారు.

Jyothi

Jyothi

Next Story