Hyderabad Rains: హైదరాబాద్‌లో నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి రోడ్లు జలమయం.. జీహెచ్ఎంసీకి 193 ఫిర్యాదులు

Roads Are Waterlogged Due To Rain In Hyderabad Yesterday Evening
x

Hyderabad Rains: హైదరాబాద్‌లో నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి రోడ్లు జలమయం.. జీహెచ్ఎంసీకి 193 ఫిర్యాదులు

Highlights

Hyderabad Rains: పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

Hyderabad Rains: హైదరాబాద్‌లో నిన్న సాయంత్రం 5 గంటలకు మొదలైన వాన దాదాపు గంటసేపు దంచికొట్టింది. గరిష్టంగా 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ వానకు రాత్రి 8 గంటల వరకు వరద నీరు నిలిచిందని జీహెచ్ఎంసీకి 193 ఫిర్యాదులు అందాయి. ఇది కేవలం కంట్రోల్ రూమ్‌కు వచ్చిన ఫిర్యాదుల మాత్రమేనని తెలుస్తోంది. డీఆర్ఎఫ్ విభాగం, సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చిన ఫిర్యాదులు ఇంకా చాలానే ఉన్నాట్లు తెలుస్తోంది. మొత్తంగా 250 వరకు ఫిర్యాదులు వరద నీరు నిలిచాయని వచ్చాయి. చెట్లు, గోడలు కూలాయని, వీధి దీపాలు వెలగడం లేదని, ఇతరత్రా ఫిర్యాదులూ వందల్లో ఉన్నాయి.

వర్షాకాలం ముగిసే వరకు నగరవాసులకు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. రోడ్లపైకి వరద నీరు చేరడం, డ్రైనేజీలు పొంగడం వంటి ఇబ్బందులతో ప్రజలు సతమతమవుతున్నారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే జీహెచ్‌ఎంసీ అధికారులు అనేక చర్యలు తీసుకున్నా ఒక్క వర్షానికే మళీ కథ మొదటికి వస్తోంది. కాలనీల్లో నీరు చేరడం, తాగునీరు, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడం వంటి సమస్యలు ఉతన్నమవుతూనే ఉన్నాయి.

సాయంత్రం కురిసిన భారీ వర్షానికి గ్రేటర్, రంగారెడ్డి జోన్ లో 40కి ఫీడర్లు ట్రిప్పయ్యాయి. దీంతో సూపరింటెండింగ్ ఇంజనీర్లు, చీఫ్ జనరల్ మేనేజర్లతో టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ జి. రఘుమారెడ్డి సమీక్షించారు. స్కాడాలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు విద్యుత్ లైన్లు, స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories