Hyderabad: గోషామహల్‌లో కుంగిన పెద్ద నాల.. దుకాణాలు, వాహనాలు ధ్వంసం..

Goshamahal: నాలాపై ఉన్న కార్లు, ఆటోలు, బైకులు గల్లంతు

R Tripura Malini
Published on: 23 Dec 2022 3:08 PM IST
Goshamahal Road Is Sagged Chaknawadi
X

గోషామహల్‌ చాక్నవాడిలో కుంగిపోయిన పెద్దనాలా

Goshamahal: గోషామహల్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. చాక్నవాడిలో పెద్దనాలా కుంగిపోయింది. దీంతో నాలాపై ఉన్న కార్లు, ఆటోలు, బైకులు గల్లంతయ్యాయి. శుక్రవారం బస్తీ మార్కెట్‌ కావడంతో ఏర్పాటు చేసిన దుకాణాలు కూడా నాలాలో పడిపోయాయి. దీంతో పలువురికి గాయాలయ్యాయి. మరోవైపు నాలా కుంగిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. మార్కెట్‌కు వచ్చిన ప్రజలను తరలిస్తున్నారు. కాగా, నాలా కుంగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

R Tripura Malini

R Tripura Malini

Next Story