మద్యం మత్తులో.. నగరంలో రెండు ప్రమాదాలు

మద్యం మత్తులో.. నగరంలో రెండు ప్రమాదాలు
x
బంజారా హిల్స్ లో బెంజికారు ప్రమాదం 
Highlights

* హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో బెంజ్‌ కారు బీభత్సం * అతివేగంతో ఇండికా కారును ఢీకొట్టిన బెంజ్‌ కారు * ఇండికా కారులోని ఇద్దరికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు * మద్యం మత్తులో బెంజ్‌ కారును నడిపినట్టు గుర్తింపు

హైదరాబాద్‌లో మందుబాబులు మరోసారి హల్‌చల్‌ చేశారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 3 దగ్గర బెంజ్‌ కారుతో బీభత్సం సృష్టించారు. అతివేగంగా బెంజ్‌ కారును నడుపుతూ ఇండికా క్యాబ్‌ను ఢీకొట్టారు. ఈ ఘటనలో క్యాబ్‌లో ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలు కాగా.. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. బెంజ్‌ కారులో ముగ్గురు యువకులు, యువతి ఉన్నట్టు గుర్తించారు. కారును నడిపిన ఇద్దరిని బంజారాహిల్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అదేవిధంగా మరో ఘటనలో ..మాదాపూర్‌లో ద్విచక్రవాహనదారుడు మితిమీరిన వేగంతో వాహనం నడిపి ప్రమాదానికి గురయ్యాడు. రోడ్డు విభాగిని ఢీకొనడంతో అదుపుతప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని పోలీసులు అసుపత్రికి తరలించారు.

నగరంలో అర్ధరాత్రి జరిగిన ఈ రెండు వేర్వేరు ప్రాంతాల రోడ్డు ప్రమాదాల్లో వాహనదారులు మద్యం సేవించడం వల్లనే ప్రమాదాలు జరిగాయని పోలీసులు తెలిపారు.
Show Full Article
Print Article
Next Story
More Stories