Road Accident: ఉలవపాడు హైవేపై రోడ్డు ప్రమాదం.. 10 మందికి గాయాలు

ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉలవపాడు హైవేపై రోడ్డుప్రమాదం జరిగింది. ఉలవపాడు బైపాస్‌ దగ్గర ఆటోను కారు ఢీకొట్టింది.

Arun Chilukuri
Published on: 6 Nov 2025 2:39 PM IST
Road Accident: ఉలవపాడు హైవేపై రోడ్డు ప్రమాదం.. 10 మందికి గాయాలు
X

Road Accident: ఉలవపాడు హైవేపై రోడ్డు ప్రమాదం.. 10 మందికి గాయాలు

ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉలవపాడు హైవేపై రోడ్డుప్రమాదం జరిగింది. ఉలవపాడు బైపాస్‌ దగ్గర ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో అలగాయపాలెం ఎస్సీ కాలనీకి చెందిన 10 మంది మహిళలు గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఒంగోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. మంత్రి లోకేష్‌ పర్యటన కోసం ఆటోలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story