Accident:వరంగల్‌ జిల్లాలో రోడ్డుప్రమాదం ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు

* ఒంగోలు నుంచి వరంగల్‌కు వస్తుండగా ప్రమాదం.. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు

R Tripura Malini
Published on: 8 Nov 2022 9:19 AM IST
Road accident in Warangal district
X

వరంగల్‌ జిల్లాలో రోడ్డుప్రమాదం ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు

Road Accident: వరంగల్ జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వర్ధన్నపేట శివారు డీసీ తండాలో ఆగివున్న లారీని వెనుకనుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులు కృష్ణారెడ్డి, వరలక్ష్మి, వెంకట సాయిరెడ్డి ఒకే కుటుంబానికి చెందినవారుగా గుర్తించారు. ఒంగోలు నుంచి వరంగల్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలను వరంగల్‌ ఎంజీఎం మార్చురీకి తరలించారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story