సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి

X
Highlights
Road Accident in Sangareddy : సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పఠాన్ చెరు మండలం పాటి...
Arun Chilukuri10 Nov 2020 2:56 AM GMT
Road Accident in Sangareddy : సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పఠాన్ చెరు మండలం పాటి ఓఆర్‌ఆర్ రింగ్ రోడ్డుపై గుర్తు తెలియని వాహనం కారును ఢీకొని ఆరుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ప్రమాద సమయంలో వాహనంలో పది మంది ప్రయాణిస్తున్నారు. నలుగురు వ్యక్తులు ప్రమాదం నుంచి బయపడ్డారు. మృతలు జార్ఖండా లోని ఘోరక్ పూర్, రాంఘడ్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. గచ్చిబౌలి నుండి జార్ఖండ్ వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ పుటేజీల ఆధారంగా ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Web TitleRoad Accident in Sangareddy
Next Story