TS News: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. లారీని ఢీకొన్న కారు.. నలుగురు మృతి

TS News: మృతులంతా నిజాంపేట్‌కు చెందినవారు

Dhatripriya
Published on: 19 May 2023 4:34 PM IST
Road Accident In Ranga Reddy District
X

TS News: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. లారీని ఢీకొన్న కారు.. నలుగురు మృతి 

TS News: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. లారీని ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మృతులు హర్షిత, అంకిత, అమృత్‌, నితిన్‌గా గుర్తించారు. ప్రమాదసమయంలో కారులో మొత్తం 12 మంది ఉన్నట్టు తెలుస్తోంది. మరో 8 మందికి తీవ్రగాయాలు కాగా.. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. బ్యాచిలర్‌ పార్టీ కోసం ఒకే కారులో 12 మంది వెళ్లినట్టు సమాచారం. గండిపేట మండలం ఖానాపూర్‌లో ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా నిజాంపేట్‌కు చెందినవారిగా గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story