ఆటో, ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ప్రమాదం.. ఆటోలో వెళ్తున్న బాలుడు కార్తీక్ దుర్మరణం

Ranga Reddy: మృతుడి తండ్రి పరిస్థితి విషమం.. బాలుడి మృతదేహంతో బంధువుల ధర్నా

Jyothi
Updated on: 27 Oct 2022 1:21 PM IST
Road Accident In Ranga Reddy
X

ఆటో, ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ప్రమాదం.. ఆటోలో వెళ్తున్న బాలుడు కార్తీక్ దుర్మరణం

Ranga Reddy: రంగారెడ్డి జిల్లా మంచాల ఆంబోతండా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో-ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో బాలుడు మృతి చెందగా... తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడిని నగరంలోని ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద తీవ్రతకు ఆటో నుజ్జునుజ్జయింది. న్యాయం చేయాలంటూ బాలుడి మృతదేహంతో బంధువులు ధర్నాకు దిగారు. ఆందోళనకు స్థానిక నేతలు మద్దతు తెలిపారు. ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. బాధితుల ఆందోళనతో స్వల్ప ఉద్రిక్తత తలెత్తింది.

Jyothi

Jyothi

Next Story