నిర్మల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 35 మందికి గాయాలు, ఐదుగురికి తీవ్రగాయాలు

Nirmal - Road Accident: దీపావళి పండుగకు సొంతూరు వెళ్తున్న కూలీలు...

Shireesha
Published on: 3 Nov 2021 9:37 AM IST
Road Accident in Nirmal National Highway 44 Injured 35 Members | Telangana Latest News
X

నిర్మల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 35 మందికి గాయాలు, ఐదుగురికి తీవ్రగాయాలు

Nirmal - Road Accident: నిర్మల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొండాపూర్‌ వద్ద నేషనల్ హైవే 44పై ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్ బోల్తా పడింది. ఈ ఘటనలో 35 మందికి గాయాలు కాగా వారిలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి అలహాబాద్‌కు వలస కూలీలతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ వెళ్తోంది.

దీపావళి పండుగను జరుపుకోవడానికి వీరంతా సొంతూరు వెళ్తున్నట్లు తెలిపారు. డ్రైవర్ మద్యం సేవించడం వల్లే ప్రమాదం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు.

Shireesha

Shireesha

Next Story