నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం; ఆరుగురు మృతి

Arun Chilukuri
Published on: 21 Jan 2021 9:30 PM IST
నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం; ఆరుగురు మృతి
X

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని పీఏపల్లి మండలం అంగడిపేట గ్రామం వద్ద గురువారం సాయంత్రం కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ బలంగా ఢీకొట్టడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు.14 మంది తీవ్ర గాయాలపాలవ్వగా.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. మృతులంతా దేవరకొండ మండలం చింతబావికి చెందిన వారుగా తెలుస్తుంది.

మృతిచెందిన వారి వివరాలు

1. మల్లేశం (ఆటోడ్రైవర్‌)

2. నోమల పెద్దమ్మ

3. నోమల సైదమ్మ

4. కొట్టం పెద్దమ్మ

5. గొడుగు ఇద్దమ్మ

6, మల్లమ్మ

Arun Chilukuri

Arun Chilukuri

Next Story