Mulugu: ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఎస్సై ఇంద్రయ్య, డ్రైవర్ మృతి

Mulugu: జీడివాగు సమీపంలో అదుపుతప్పి బోల్తా కొట్టిన బొలెరో వాహనం

Dhatripriya
Published on: 2 May 2023 7:37 PM IST
Mulugu: ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఎస్సై ఇంద్రయ్య, డ్రైవర్ మృతి
X

Mulugu: ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఎస్సై ఇంద్రయ్య, డ్రైవర్ మృతి

Mulugu: ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏటూరునాగారం ఎస్సై ఇంద్రయ్య, డ్రైవర్ రాజు అక్కడికక్కడే మృతిచెందారు. కానిస్టేబుల్ శ్రీనివాస్ స్వల్ప గాయాలయ్యాయి అయితే విధి నిర్వహణలో భాగంగా మంగపేట వెళ్తుండగా జీడివాగు సమీపంలో బోలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడటంతో ప్రమాదం జరిగింది. శ్రీనివాస్‌ను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.సమాచారం తెలుసుకున్న ఏటూరు నాగారం ఎస్ఐ రమేష్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఏటురునాగారం ఆసుపత్రికి తరలించారు.

Dhatripriya

Dhatripriya

Next Story