ఉమ్మడి ఖమ్మం జిల్లా మధిరలో ఘోర రోడ్డు ప్రమాదం

Sandeep Eggoju
Published on: 10 Jan 2021 10:33 AM IST
Road Accident in Madhira Khammam District
X

representational image

ఉమ్మడి ఖమ్మం జిల్లా మధిరలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంతో వచ్చిన లారీ ట్రాక్టర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌ ఎగిరిపడి రెండు ముక్కలయ్యింది. ట్రాక్టర్‌ డ్రైవర్‌కు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ట్రాక్టర్‌ డ్రైవర్‌ మృతి చెందారు.

లారీ డ్రైవర్‌ మద్యం సేవించి డ్రైవింగ్‌ చేయడం వల్లే ప్రమాదం జరిగిందంటున్నారు స్థానికులు. ప్రమాద దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో నమోదయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిత్యం వందలాది సుబాబుల్‌ లారీలు పట్టణం నుంచి అతి వేగంతో వెళ్తుంటాయని ఇప్పటికైనా పోలీసులు స్పందించి చర్యలు తీసుకోవాలంటున్నారు స్థానికులు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story