కర్నూలులో జనంపైకి దూసుకెళ్లిన డీసీఎం.. నలుగురు చిన్నారులు మృతి..

కర్నూలులో జనంపైకి దూసుకెళ్లిన డీసీఎం.. నలుగురు చిన్నారులు మృతి..
x
Highlights

కర్నూలు జిల్లా యర్రగుంట్ల దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మత ప్రార్ధనల కోసం వెళ్తున్న 40 మంది పాదచారులపైకి అదుపు తప్పి లారీ దూసుకెళ్లింది. ఈ...

కర్నూలు జిల్లా యర్రగుంట్ల దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మత ప్రార్ధనల కోసం వెళ్తున్న 40 మంది పాదచారులపైకి అదుపు తప్పి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు మృతిచెందారు. ప్రమాదం జరిగిన వెంటనే ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వారిలో 8మంది పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న మరో చిన్నారి మృతి చెందడంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య నలుగురికి చేరింది.

యర్రగుంట రోడ్డు ప్రమాదంలో గాయపడిన 15మందిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరికి సమీప ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారు 40 మంది ఎస్సీ కాలనీ వాసులుగా గుర్తించారు. మరోవైపు, జనాలను ఢీ కొట్టిన తర్వాత, డ్రైవర్ లారీని ఆపకుండా వెళ్లిపోయాడు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో వెంటనే స్పందించిన పోలీసులు ఛేజ్‌ చేసి, బత్తలూరు దగ్గర లారీని పట్టుకున్నారు. క్షత్రగాత్రులను నంధ్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories