కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి.. 21 మందికి గాయాలు

Road Accident: కామారెడ్డి జిల్లా హాసంపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.

Arun Chilukuri
Published on: 8 May 2022 7:17 PM IST
Road Accident in Kamareddy District
X

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురి మృతి.. 21 మందికి గాయాలు

Road Accident: కామారెడ్డి జిల్లా హాసంపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టాటాఏస్‌ వాహనం, లారీ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో 21 మందికి గాయాలయ్యాయి. ఎల్లారెడ్డి సంతకు వచ్చి పిట్లం మండలంలోని చిల్లర్గి గ్రామానికి తిరిగి వెళ్తుండగా ట్రాలీ ఆటోను ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. మృతుల్లో డ్రైవర్‌ సాయిలుతో పాటు లచ్చవ్వ, దేవయ్య, కంసవ్వ, కేశయ్య ఉన్నారు. క్షతగాత్రులను బాన్సువాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story