Top
logo

కామారెడ్డి జిల్లాలో రోడ్డుప్రమాదం

కామారెడ్డి జిల్లాలో రోడ్డుప్రమాదం
X
Highlights

* రోడ్డు మరమ్మతులు చేస్తున్న కార్మికుడిపై నుంచి వెళ్లిన కంటైనర్‌ * కార్మికుడికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు

కామారెడ్డి జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది. సదాశివనగర్‌ మండలం పద్మాజివాడి శివారులో జాతీయ రహదారిపై రోడ్డు మరమ్మతులు జరుగుతున్నాయి. ఇక.. అదే సమయంలో అటుగా ఓ కంటైనర్‌ వస్తుండడంతో దానిని ఆపాలని కార్మికుడు సిగ్నల్‌ ఇచ్చాడు.

అది పట్టించుకోకుండా కంటైనర్‌ డ్రైవర్‌ ముందుకు దూసుకురావడంతో ఆగ్రహానికి గురైన కార్మికుడు.. డ్రైవర్‌పై దాడికి యత్నించి కిందపడిపోయాడు. కంటైనర్‌ లారీ వెనుక చక్రాలు అతడి కాలుపై నుంచి వెళ్లాయి. ఈ ఘటనలో కార్మికుడికి తీవ్రగాయాలు కావడంతో అతడిని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Web TitleRoad accident in Kamareddy district
Next Story