Jangaon: జనగామ జిల్లా పెంబర్తి జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం

Jangaon: డీసీఎం పంక్చర్‌ కావడంతో టైరు మారుస్తుండగా ఘటన

Dhatripriya
Published on: 7 Feb 2023 8:41 AM IST
Road Accident In Jangaon
X

Jangaon: జనగామ జిల్లా పెంబర్తి జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం

Jangaon: జనగామ జిల్లా పెంబర్తి జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం జరిగింది. ఆగివున్న డీసీఎంను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. డీసీఎం డ్రైవర్‌, క్లీనర్‌తో పాటు కారులో ప్రయాణిస్తున్న ఆరేళ్ల చిన్నారి మృత్యువాత పడింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డీసీఎం వాహనం పంక్చర్‌ కావడంతో టైరు మారుస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు్న్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story