Jagtial: రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Jagtial: మృతులు ఏపీకి చెందిన తాపీ మేస్త్రీలుగా గుర్తింపు

Jyothi
Published on: 17 March 2024 1:41 PM IST
Road Accident in  Jagtial
X

Jagtial: రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి 

Jagtial: పనికోసం వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. జగిత్యాల జిల్లా వెంకటాపూర్‌లో గ్రామ శివారులో ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు తాపీమేస్త్రీలు మరణించారు. తెల్లవారుజామున పనికోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.

వారంతా రోజూ కూలిపనులు చేసుకునే కార్మికులు. రోజూ లాగే.. పనికోసం కలిసి బయలుదేరారు. కాసేపట్లో పనిలోకి చేరుతారు అనగా.. విధి కన్నెర్రజేసింది. తెల్లవారుజామున కావడంతో మసకమబ్బులో రోడ్డుపక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. స్పాట్‌లోనే ఇద్దరు చనిపోగా.. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతూ మరొకరు మరణించారు. వీరంతా ఏపీకి చెందిన తాపీ మేస్త్రీలుగా గుర్తించారు. పనికోసం అక్కడినుంచి వలస వచ్చి.. జీవనం సాగిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story