Ramadugu: రక్తదానం చేసిన రెవెన్యూ సిబ్బంది

రామడుగు: మండల తహసీల్దార్ కోమల్ రెడ్డి, సిబ్బంది కలిసి కరీంనగర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో రక్తదానం చేశారు.

Swathi Adulapuram
Published on: 26 April 2020 3:15 PM IST
Ramadugu: రక్తదానం చేసిన రెవెన్యూ సిబ్బంది
X

రామడుగు: మండల తహసీల్దార్ కోమల్ రెడ్డి, సిబ్బంది కలిసి కరీంనగర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో రక్తదానం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ... కరోనా వైరస్ వ్యాపిస్తున్న తరుణంలో లాక్ డౌన్ వలన, బ్లడ్ బ్యాంక్ లల్లో రక్త దాతలు లేక రక్త నిల్వలు తగ్గాయని, రక్త దానం చేసే వారు ముందుకు వచ్చి రక్తదానం చేస్తే, అత్యవసర సమయాల్లో బాధితులకు ఉపయోగపడుతుందని తెలిపారు.

రక్తదానం చేసిన వారిలో తహసీల్దార్ కోమల్ రెడ్డితో పాటు నాయబ్ తహసీల్దార్ కిరణ్ కుమార్ రెడ్డి, వీఆర్వో బాబా, విఆర్ఎలు చంద్రయ్య, సుమన్, కమలాకర్, నవ కాంత్, సురేష్ ఉన్నారు.

Swathi Adulapuram

Swathi Adulapuram

Next Story