Revanth Reddy: రైతులను ఆదుకోవాలని సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లే‌ఖ

Revanth Reddy: రైతాంగాన్ని ఆదుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్

Jyothi
Published on: 19 March 2023 2:38 PM IST
Revanth Reddy Writes Open Letter to CM KCR
X

Revanth Reddy: రైతులను ఆదుకోవాలని సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లే‌ఖ

Revanth Reddy: రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయని, దీంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రైతులను ఆదుకోవాలని సీఎం కేసీఆర్‌కు బహిరంగ లే‌ఖ రాశారు. పెరిగిన పెట్టుబడులతో అన్నదాతలు నష్టపోయారని, ఆరుగాలం కష్టపడిన రైతాంగాన్ని వానలు నట్టేట ముంచాయని ఆవేదన వ్యక్తం చేశారాయన.. రైతాంగాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని రేవంత్ రెడ్డి ఆ లేఖలో డిమాండ్ చేశారు. మూలిగే నక్కపై తాడిపండు పడిన చందంగా రైతుల పరిస్థితి మారిందన్నారాయన.

Jyothi

Jyothi

Next Story