Revanth Reddy: కాంగ్రెస్‌ నేతలకు రేవంత్‌రెడ్డి వార్నింగ్.. చర్యలు తప్పవు..

Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మరోసారి నేతలకు వార్నింగ్ ఇచ్చారు.

Arun Chilukuri
Published on: 21 Jan 2023 6:24 PM IST
Revanth Reddy Warning To Congress Leaders
X

Revanth Reddy: కాంగ్రెస్‌ నేతలకు రేవంత్‌రెడ్డి వార్నింగ్.. చర్యలు తప్పవు..

Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మరోసారి నేతలకు వార్నింగ్ ఇచ్చారు. పార్టీకి నష్టం కలిగేలా మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. జనవరి 26న రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, మండలాలు, జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండా, పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. బాధ్యతగా పనిచేయని వారిని తప్పించి కొత్తవారికి బాధ్యతలు అప్పగిస్తామన్నారు రేవంత్‌రెడ్డి. ఎవరైనా బహిరంగంగా మాట్లాడవచ్చని.. అయితే పార్టీకి నష్టం కలిగించేలా వారి వ్యాఖ్యలు ఉండకూడదని థాక్రే సూచించారని రేవంత్ తెలిపారు. పార్టీకి నష్టం కలిగేలా మాట్లాడితే చర్యలు తీసుకోవడానికి వెనుకడమని రేవంత్‌రెడ్డి తేల్చిచెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story