రేపు ఢిల్లీకి రేవంత్‌రెడ్డి

Arun Chilukuri
Published on: 15 Dec 2020 4:49 PM IST
రేపు ఢిల్లీకి రేవంత్‌రెడ్డి
X

కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు రాహుల్‌గాంధీతో రేవంత్ సమావేశం కానున్నారు. టీపీసీసీ చీఫ్‌ ఎంపిక ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో రాహుల్ తో రేవంత్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఇక, రేపు మధ్యాహ్నం 3గంటలకు ఢిల్లీలో జరగనున్న డిఫెన్స్ కమిటీ సమావేశానికి రాహుల్‌తో కలిసి రేవంత్ పాల్గొననున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ నూతన సారథి ఎంపిక ఆ పార్టీ నేతల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. అధిష్ఠానం ఎవరిని ఎంపిక చేస్తుందని కాంగ్రెస్‌ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటు కాంగ్రెస్ అధిష్ఠానం కూడా టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణికం ఠాగూర్ 200 మంది నేతలను సంప్రదించి ఓ నివేదిక రూపొందించారు. అయితే అన్ని అర్హతలు ఉన్నవారికే టీపీసీసీ అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించాలని నేతలు మాణికం ఠాగూర్‌ను కోరినట్లు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story