Revanth Reddy: టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి బాధ్యతలు

Revanth Reddy: గాంధీభవన్‌లో పండితుల ఆశీర్వచనాల మధ్య బాధ్యతల స్వీకరణ

Sandeep Eggoju
Published on: 7 July 2021 2:50 PM IST
Revanth Reddy: టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి బాధ్యతలు
X

Revanth Reddy: టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి బాధ్యతలు

Revanth Reddy: తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గాంధీభవన్‌లో పండితుల ఆశీర్వచనాల మధ్య ఆయన బాధ్యతలు చేపట్టారు. మాజీ టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించారు రేవంత్‌రెడ్డి. ఇక.. ఈ కార్యక్రమానికి పలువురు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలతో పాటు కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డికి వేద పండితులు ఆశీర్వచనం అందించారు. పీసీసీ బాధ్యతలకు సంబంధించిన పత్రాలపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి సంతకాలు చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌కు శుభాకాంక్షలు తెలిపిన నేతలు.. కాంగ్రెస్‌కు పునర్వైభవం తేవాలని ఆకాక్షించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story