Revanth Reddy: త్వరలో కేసీఆర్‌ చర్లపల్లి జైల్లో సేదతీరుతాడు

Revanth Reddy: సీఎం కేసీఆర్‌పై టీ.పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి నిప్పులు చెరిగారు.

Arun Chilukuri
Updated on: 9 Aug 2021 9:00 PM IST
Revanth Reddy Strong Warning To CM KCR
X

Revanth Reddy: త్వరలో కేసీఆర్‌ చర్లపల్లి జైల్లో సేదతీరుతాడు

Revanth Reddy: సీఎం కేసీఆర్‌పై టీ.పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో రావుల రాజ్యం నడుస్తోందన్న రేవంత్‌ త్వరలోనే కేసీఆర్‌ చర్లపల్లి జైల్లో సేదతీరుతాడని చెప్పారు. ఇంద్రవెల్లి సభా వేదికగా దళితబంధుతోపాటు గిరిజన బంధు కూడా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ పాలనలో ఎస్సీ, ఎస్టీల జీవితాలు చితికిపోతున్నాయని, ఆదివాసీల జీవితాలు మార్చాలనేదే కాంగ్రెస్‌ ప్రణాళిక అని రేవంత్‌ రెడ్డి అన్నారు.

ఎన్నికల కోసమే పథకాలు తెచ్చానని సీఎం ఒప్పుకున్నారని చెప్పారు. ఉప ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్‌కు ఎస్సీలు గుర్తుకొస్తారని, దళితబంధును రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు అమలు చేయరని ప్రశ్నించారు. కేసీఆర్ మంత్రివర్గంలో మాదిగలకు స్థానమే లేదని విమర్శించారు. చివరి రక్తపు బొట్టు వరకు ప్రజలకు తోడు, నీడగా ఉంటానని రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. సమైక్యపాలనలో అడవి బిడ్డలను కాల్చేస్తుంటే ఈ ప్రాంత నేతలు నిస్సహాయులుగా నిలిచిపోయారని ఆరోపించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story