రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. అచ్చంపేట నుంచి పాదయాత్ర

*పాదయాత్రను ప్రారంభించిన ఎంపీ రేవంత్‌రెడ్డి *పాదయాత్రలో పాల్గొన్న సీతక్క, మల్లు రవి

Samba Siva Rao
Published on: 7 Feb 2021 9:01 PM IST
రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. అచ్చంపేట నుంచి పాదయాత్ర
X

రేవంత్ రెడ్డి ఫైల్ ఫోటో 

రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు రాజీవ్ రైతు భరోసా పాదయాత్రను ఎంపీ రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అచ్చంపేటలో ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. రైతు పండించిన పంటకు ధరలు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ రైతుల నడ్డి విరిచే వ్యవసాయా చట్టాలను తీసుకు వచ్చారని విమర్శించారు. కేంద్రం తెచ్చిన చట్టాలను సీఎం కేసీఆర్ సమర్ధిస్తున్నారు తప్ప రైతులకు మేలు చేకూర్చే ప్రయత్నాలు చేయటం లేదని ఆరోపించారు. ఢిల్లీలో పోరాటం చేస్తా అని చెప్పిన కేసీఆర్.. మోడీతో చేయి కలిపారని విమర్శించారు.

అయితే రేవంత్ రెడ్డి దీక్షకు హాజరైనా టీ కాంగ్రెస్ నేతలు మల్లు రవి, సీతక్క ఆయన పాదయాత్ర చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో అ చ్చంపేట నుంచి తాను హైదరాబాద్‌కు కారులో కాదని, పాదయాత్ర చేసుకుంటూ వెళ్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. రేవంత్ రెడ్డి దీక్ష కాకుండా పాదయాత్ర చేస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన వస్తుందని భావించారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story