Revanth Reddy: మోడీకి కేసీఆర్‌ లొంగిపోయారు

Revanth Reddy: లఖింపూర్‌ ఘటనకు కారణమైనవారిని కఠినంగా శిక్షించాలన్నారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి.

Arun Chilukuri
Updated on: 11 Oct 2021 3:26 PM IST
Revanth Reddy Slams PM Modi, CM KCR
X

Revanth Reddy: మోడీకి కేసీఆర్‌ లొంగిపోయారు

Revanth Reddy: లఖింపూర్‌ ఘటనకు కారణమైనవారిని కఠినంగా శిక్షించాలన్నారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి. శాంతిభద్రతలు కాపాడాల్సిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కొడుకే రైతులను కారుతో తొక్కించి చంపారన్నారు. ఈ దాడిని ప్రపంచం మొత్తం ఖండిస్తుంటే మోడీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

పరామర్శించేందుకు వెళ్లిన ప్రియాంక గాంధీని అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు ఆయన. తెలంగాణలో నేరేళ్ల ఘటన, యూపీలో లఖింపూర్‌ ఘటన రెండూ ఒక్కటేనన్నారు. కేసీఆర్ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించినట్లు చెప్పారని అయితే ఢిల్లీకి వెళ్లి వచ్చిన తరువాత కేసీఆర్‌కు చలిజ్వరం పట్టుకుందని ఆయన వ్యాఖ్యానించారు. మోడీకి కేసీఆర్‌ లొంగిపోయారని విమర్శించారు రేవంత్‌ రెడ్డి.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story