Revanth Reddy: అమ్ముడుపోయినవాళ్లను తరిమి కొట్టండి..

Revanth Reddy: సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ రాష్ట్ర విలీన కార్యక్రమాలను స్వాతంత్య్ర ఉత్సవాలతో సమానంగా నిర్వహించాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్ చేశారు.

Arun Chilukuri
Published on: 3 Sept 2022 3:47 PM IST
Revanth Reddy Slams Komatireddy Raj Gopal Reddy
X

Revanth Reddy: అమ్ముడుపోయినవాళ్లను తరిమి కొట్టండి.. 

Revanth Reddy: సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ రాష్ట్ర విలీన కార్యక్రమాలను స్వాతంత్య్ర ఉత్సవాలతో సమానంగా నిర్వహించాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్ చేశారు. గడిచిన 8 ఏళ్లుగా సెప్టెంబర్‌ 17ను సీఎం కేసీఆర్ ఎందుకు అధికారికంగా నిర్వహించలేదని ప్రశ్నించారు. ఎంతో చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ప్రజలతో కలిసి పోరాటాలు చేస్తే కొన్నేళ్ల క్రితం పుట్టుకొచ్చని టీఆర్ఎస్, బీజేపీలు మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తోందన్నారు. మునుగోడు ప్రజలు ఇదంతా గమనించాలని కోరారు.

కార్యకర్తలంతా కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. అమ్ముడుపోయిన వాళ్లను మునుగోడు నుంచి తరిమేయాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు రేవంత్‌ రెడ్డి. మునుగోడులో తమను ఓడించే శక్తి ఏ రాజకీయ పార్టీకి లేదన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి అమ్ముడుపోయాడనేది బహిరంగ రహస్యమే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ ఎంతో చేసింది. కానీ, ఆయన కాంగ్రెస్‌కు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story