Revanth Reddy: రాజగోపాల్‌రెడ్డిని RG పాల్ అని పిలవాలి.. అలా పిలిస్తే షోకాజ్ నోటీసులు..

Revanth Reddy: గాంధీభవన్‌లో అనుబంధ సంఘాల సమావేశంలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 11 Aug 2022 4:20 PM IST
Revanth Reddy Slams Komatireddy Raj Gopal Reddy
X

Revanth Reddy: రాజగోపాల్‌రెడ్డిని RG పాల్ అని పిలవాలి.. అలా పిలిస్తే షోకాజ్ నోటీసులు..

Revanth Reddy: గాంధీభవన్‌లో అనుబంధ సంఘాల సమావేశంలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని RG పాల్ అని పిలవాలని రేవంత్ సూచించారు. ఒకవేళ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అని పిలిస్తే షోకాజ్ నోటీసులు ఇస్తామని సభలు, సమావేశాల్లో కూడా RG పాల్ అని పిలవాలని ఆదేశించారు రేవంత్‌రెడ్డి.

టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఒప్పందం ఉందని రేవంత్ ఆరోపించారు. రాజగోపాల్ రాజీనామా 5 నిమిషాల్లో ఎలా ఆమోదించారని ప్రశ్నించారు. ఉప ఎన్నికకు అంత తొందర ఏముందన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక అప్పట్లో టీఆర్ఎస్‌కు అవసరమని మునుగోడు ఉపఎన్నిక ఇప్పుడు బీజేపీకి అవసరమని రేవంత్ వ్యాఖ్యానించారు. ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకుంటున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story