Revanth Reddy: ఇంకోసారి రాజ్యాంగం గురించి మాట్లాడితే రాళ్లతో కొట్టిస్తా...

Revanth Reddy: అంబేద్కర్ రాజ్యాంగం వల్లే కేసీఆర్ రెండుసార్లు తెలంగాణకు సీఎం అయ్యారన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.

Arun Chilukuri
Published on: 4 Feb 2022 7:37 PM IST
Revanth Reddy Slams CM KCR over Constitution Remark
X

Revanth Reddy: ఇంకోసారి రాజ్యాంగం గురించి మాట్లాడితే రాళ్లతో కొట్టిస్తా...

Revanth Reddy: అంబేద్కర్ రాజ్యాంగం వల్లే కేసీఆర్ రెండుసార్లు తెలంగాణకు సీఎం అయ్యారన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. కేసీఆర్ వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. సీఎం వ్యాఖ్యలకు ప్రధాని మోడీ సూత్రధారి అయితే, కేసీఆర్ పాత్రధారి అని ఫైర్ అయ్యారు. మరోసారి కేసీఆర్ రాజ్యాంగం గురించి మాట్లాడితే రాళ్లతో కొట్టిస్తా అని హెచ్చరించారు. చైనా శాశ్వత అధ్యక్షుడిగా ఉండేందుకు జిన్‌పింగ్‌ రాజ్యాంగాన్నే మార్చేశారని పేర్కొన్నారు. కేసీఆర్‌, మోడీ కూడా జిన్‌పింగ్ తరహా ఆలోచనే చేస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగ స్ఫూర్తి ప్రపంచానికి తెలిసింది కానీ కేసీఆర్‌కు తెలియలేదని రేవంత్‌ వ్యాఖ్యానించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story