Revanth Reddy: టాలీవుడ్‌ డ్రగ్స్ కేసుపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Revanth Reddy: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసుపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Updated on: 27 Aug 2021 8:43 PM IST
Revanth Reddy Sensational Comments on Tollywood Drugs Case
X

Revanth Reddy: టాలీవుడ్‌ డ్రగ్స్ కేసుపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Revanth Reddy: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసుపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి కేటీఆర్‌ దగ్గరివారికి డ్రగ్స్‌ కేసులో ప్రమేయం ఉందన్నారు‌. నాలుగైదు రోజులుగా కేటీఆర్‌ కంగారులో ఉన్నట్లు చెప్పిన రేవంత్‌ మంత్రి కేటీఆర్‌ గోవాకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. ఒకవేళ కేటీఆర్‌ది అధికారిక పర్యటన అయితే వివరాలు బయటపెట్టాలంటూ డిమాండ్‌ చేశారు. ఇక డ్రగ్స్‌ కేసులో అకున్‌ సబర్వాల్‌ కొందరిని విచారించకుండా వదిలేశారన్నారు రేవంత్‌ రెడ్డి. ఈ కేసులో విషయంలో కేటీఆర్ సహా ఎవరిపైనా తాను ఆరోపణలు చేయడం లేదన్న రేవంత్ రెడ్డి.. కేసు విచారణ సమగ్రంగా చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్‌తో పిల్లల భవిష్యత్తును నాశనం అవుతున్నా.. ఈ విషయంలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story