Revanth Reddy: రాహుల్‌పై అనర్హత వేటు దుర్మార్గం...

Revanth Reddy: రాహుల్‌పై అనర్హత వేటు దుర్మార్గం...

Arun Chilukuri
Published on: 24 March 2023 5:53 PM IST
Revanth Reddy Respond on Rahul Gandhi Disqualify
X

Revanth Reddy: రాహుల్‌పై అనర్హత వేటు దుర్మార్గం...

Revanth Reddy: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం దుర్మార్గమని TPCC అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. అదానీ కుంభకోణంపై చర్చ జరగకుండా ఉండేందుకే రాహుల్‌పై వేటు వేశారన్నారు. కోర్టు తీర్పుపై అప్పీల్‌కు 30 రోజుల సమయం ఉన్నా.. అనర్హత వేటు వేయడం రాజకీయ కక్ష్య సాధింపేనని విమర్శించారు. భారత్ జోడో యాత్ర తర్వాతే రాహుల్‌పై బీజేపీ కక్ష సాధింపులకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. అదానీ కుంభకోణంపై చర్చ జరగకుండా ఉండేందుకే కేంద్ర ప్రభుత్వం ఇలా చేస్తోందన్నారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితి ఉందన్న రేవంత్.. దీనిని కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుందన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story