Revanth Reddy: కేటీఆర్ కు రేవంత్ రెడ్డి తాజా సవాల్.. దమ్ముంటే నవంబర్ 15 లోపు..

Revanth Reddy: మంత్రి కేటీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాజాగా మరో సవాల్ విసిరారు.

Arun Chilukuri
Updated on: 19 Oct 2021 9:42 PM IST
Revanth Reddy Open Challenge to Minister KTR
X

Revanth Reddy: కేటీఆర్ కు రేవంత్ రెడ్డి తాజా సవాల్.. నవంబర్ 15 లోపు..

Revanth Reddy: మంత్రి కేటీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాజాగా మరో సవాల్ విసిరారు. టీఆర్ఎస్ పార్టీలో చీలిక అనివార్యమని పునరుద్ఘాటించారు. దమ్ముంటే కేటీఆర్ నవంబర్ 15 లోపు తనతో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. కేటీఆర్ రాజకీయాలు, పదవులు, పార్టీలు ఏరకంగా చూసినా తనకన్నా చాలా చిన్నవాడన్నారు రేవంత్. తాను ఓ జాతీయ పార్టీకి రాష్ట్రీయ అధ్యక్షుడినని, జడ్పీటీసీ స్థాయినుంచి అంచెలంచెలుగా ఎదిగి ఎంపీగా గెలిచానని అన్నారు. కేటీఆర్ ఓ ప్రాంతీయ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ మాత్రమేనని తనకన్నా అనుభవంలో చాలా చాలా చిన్నవాడనీ అన్నారు. ఏ విషయంలోనైనా కేటీఆర్ తో బహిరంగ చర్చకు తాను సిద్ధమని ముఖం చాటేయకుండా రావాలనీ పిలుపునిచ్చారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story