Revanth Reddy: నిన్న రాత్రి బీజేపీ నేత వివేక్‌తో రేవంత్‌రెడ్డి భేటీ

Revanth Reddy: కాంగ్రెస్‌ పార్టీలోకి రావాలని ఆహ్వానించిన రేవంత్‌

Shekhar G
Published on: 29 Oct 2023 12:38 PM IST
Revanth Reddy Met BJP Leader Vivek Venkatswamy
X

Revanth Reddy: నిన్న రాత్రి బీజేపీ నేత వివేక్‌తో రేవంత్‌రెడ్డి భేటీ

Revanth Reddy: మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి కుటుంబానికి కాంగ్రెస్‌ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. నిన్న బీజేపీ నేత వివేక్‌తో రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీలోకి రావాలని వివేక్‌ను రేవంత్‌ ఆహ్వానించినట్టు సమాచారం. అయితే.. పార్టీలోకి వచ్చేందుకు వివేక్‌ సుముఖత చూపినట్టు తెలుస్తోంది. అలాగే.. వివేక్‌ తనయుడు వంశీకి చెన్నూరు టికెట్‌ ఆఫర్ చేసింది కాంగ్రెస్‌. ఇక.. పెద్దపల్లి ఎంపీ బరిలో వివేక్ వెంకటస్వామిని దించేందుకు హస్తం పార్టీ ఓకే చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే వివేక్‌ సోదరుడు వినోద్‌కు హస్తం పార్టీ బెల్లంపల్లి టికెట్‌ను కన్ఫార్మ్ చేసింది. ఇక కాంగ్రెస్‌ ఇస్తున్న బంఫర్‌ ఆఫర్‌కు వివేక్‌ ఎస్ చెప్తారా..? లేక నో చెప్తారా..? అనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

Shekhar G

Shekhar G

Next Story