కేసీఆర్ బిహార్ టూర్‎పై రేవంత్ బహిరంగ లేఖ.. తెలంగాణ ప్రజల కష్టార్జితాన్ని..

Revanth Reddy: సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.

Arun Chilukuri
Published on: 1 Sept 2022 3:32 PM IST
Revanth Reddy Letter CM KCR Patna Tour
X

కేసీఆర్ బిహార్ టూర్‎పై రేవంత్ బహిరంగ లేఖ.. తెలంగాణ ప్రజల కష్టార్జితాన్ని..

Revanth Reddy: సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బీహార్ లోని గాల్వన్ లోయ అమరుల కుటుంబాలకు సీఎం సహాయం చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా స్వాగతిస్తుందన్న ఆయన.. అయితే తెలంగాణలో ఉన్న అమర జవాన్ల కుటుంబాలను మరిచిపోయి ఇతర రాష్ట్రాల్లో ఆర్థికసాయం ఏమిటని ప్రశ్నించారు. పాలమూరు జిల్లాకు చెందిన అమర జావాన్ యాదయ్య కుటుంబం మీుకు గుర్తు లేదా అని ప్రశ్నించారు. వారి కుటుంబానికి ఇచ్చిన హామీ 9 ఏళ్లు అయినా ఎందుకు నెరవేర్చలేదని చురకలంటించారు. తెలంగాణ ప్రజల కష్టార్జితాన్ని పంచిపెట్టడం సిగ్గుచేటన్నారు. స్వార్థరాజకీయాలు మాని ఇప్పటికైనా రాష్ట్రంలోని అమర జవాన్ల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story