క్లయిమాక్స్‌లో టీపీసీసీ చీఫ్ ఎంపిక.. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌కే ఛాన్సుందా?

క్లయిమాక్స్‌లో టీపీసీసీ చీఫ్ ఎంపిక.. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌కే ఛాన్సుందా?
x
Highlights

తెలంగాణ పీసీసీ రేస్ ర‌స‌వ‌త్తరంగా మారింది. అధ్యక్ష ఎంపిక ప్రక్రియ ఢిల్లీకి చేరింది. పార్టీని బ్రతికించుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానానికి ఇదే చివ‌రి...

తెలంగాణ పీసీసీ రేస్ ర‌స‌వ‌త్తరంగా మారింది. అధ్యక్ష ఎంపిక ప్రక్రియ ఢిల్లీకి చేరింది. పార్టీని బ్రతికించుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానానికి ఇదే చివ‌రి అవ‌కాశం అని విశ్లేష‌ణ‌లు కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ఎంపీ రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనుండ‌టం ఆస‌క్తిరేపుతోంది. రేవంత్‌రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. రాహుల్‌గాంధీతో కలిసి మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలో జరగనున్న డిఫెన్స్ కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ రేసులో రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తునాయి. ఇలాంటి తరుణంలో రాహుల్ గాంధీతో రేవంత్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్ ఇటీవల మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించారు. అధ్యక్షుడి ఎంపికపై కొంత మంది నేతలతో సమావేశమై అభిప్రాయాలు సేకరించారు. ఈ అభిప్రాయాలను సోనియాగాంధీకి ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి ఢిల్లీకి రావాలని పార్టీ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. టీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ జరుగుతున్న సమయంలో రాహుల్ తో రేవంత్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. తెలంగాణ కాంగ్రెస్ నూతన సారథిని అధిష్ఠానం ఎవరిని ఎంపిక చేస్తుందోనని కాంగ్రెస్ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories