క్లయిమాక్స్‌కు టీపీపీసీ చీఫ్ ఎంపిక.. రేసులోకి కొత్త పేరు..!

Arun Chilukuri
Published on: 22 Dec 2020 11:50 AM IST
క్లయిమాక్స్‌కు టీపీపీసీ చీఫ్ ఎంపిక.. రేసులోకి కొత్త పేరు..!
X

తెలంగాణకు కాబోయే పీసీసీ చీఫ్ ఎవరనే సస్పెన్స్‌కు త్వరలోనే ఎండ్ కార్డ్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎంపిక ప్రక్రియ చివరిదశకు చేరుకోగా ఈనెల 24న రేసులో ఉన్న ముగ్గురు ముఖ్య నేతలు ఢిల్లీ వెళ్తున్నట్లు తెలుస్తోంది. దీంతో టీపీసీసీ చీఫ్‌ ఎంపిక దాదాపు ఖరారయ్యిందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.

రేపు సాయంత్రం తెలంగాణ నుంచి వెళ్లే ముగ్గురు ముఖ్య నేతల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో అభిప్రాయ సేకరణ చేసిన ఏఐసీసీ ఇందులో అధిక మద్దతు ఉన్న వారినే ఎంపిక చేసే ఛాన్స్ ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story