టీకాంగ్రెస్‌లో జగ్గారెడ్డి లేఖ దుమారం.. ఎడముఖం, పెడముఖంగా రేవంత్‌, జగ్గారెడ్డి

Gandhi Bhavan: తెలంగాణ కాంగ్రెస్‌లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి రాసిన లేఖ దుమారం రేపుతోంది.

Arun Chilukuri
Updated on: 29 Dec 2021 4:11 PM IST
Revanth Reddy Jagga Reddy in Gandhi Bhavan
X

టీకాంగ్రెస్‌లో జగ్గారెడ్డి లేఖ దుమారం.. ఎడముఖం, పెడముఖంగా రేవంత్‌, జగ్గారెడ్డి

Gandhi Bhavan: తెలంగాణ కాంగ్రెస్‌లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి రాసిన లేఖ దుమారం రేపుతోంది. సోనియా, రాహుల్‌కు జగ్గారెడ్డి లేఖలు రాయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఇక మంగళవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రేవంత్‌, జగ్గారెడ్డి ఎడముఖం, పెడముఖంగానే గడిపారని తెలుస్తోంది. అటు ఈ విష‍యంలో ఎవరూ మాట్లాడకుండా ఉంటేనే బెటరని పార్టీ సీనియర్లు భావిస్తున్నారట.

ఈ డ్యామేజీని కంట్రోల్ చేసేందుకు బోసురాజు రంగంలోకి దిగారు. ఈ లేఖలపై ముందు రేవంత్‌తో భేటీ అయిన ఆయన ఆ తర్వాత జగ్గారెడ్డితో సమావేశమైనట్టు నేతలు చెబుతున్నారు. మరి ఈ లెటర్ల అంశం ఇక్కడితో ముగుస్తుందా లేక షోకాజ్‌ నోటీసుల వరకు వెళ్తుందో చూడాలి. మరోవైపు తాను రాసిన లేఖలు ఎలా బయటకు వచ్చాయో తనకు కూడా తెలియదని చెబుతున్నారు జగ్గారెడ్డి. దీనిపై విచారణ జరుపుతున్నట్టు చెప్పారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story