కోమటిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డిపై పీసీసీ చీఫ్ రేవంత్ ఫైర్‌

Revanth Reddy: మోడీని తెలంగాణ సమాజం తిరస్కరించాలి

Jyothi
Published on: 3 Aug 2022 7:27 AM IST
Revanth Reddy Fire on Komatireddy Rajagopal Reddy
X

కోమటిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డిపై పీసీసీ చీఫ్ రేవంత్ ఫైర్‌

Revanth Reddy: తెలంగాణ కోసం కొట్లాడమని చెప్పుకునే ఎంగిలి మెతుకులు కుక్క బిస్కెట్లు ఇచ్చిన కాంట్రాక్టుల కోసం ఆశపడి కన్నతల్లి లాంటి కాంగ్రెస్ ను అవమానించే విధంగా అవహేళన చేసి మాట్లాడుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిప్డడారు. తెలంగాణ ఇచ్చిన సోని గాంధీని ఈడీ వేధిస్తుంటే అమిత్ షా దగ్గరకు వెళ్లి కాంట్రాక్టు ఒప్పందాలు చేసుకున్న రాజగోపాల్ రెడ్డి నిజస్వరూపం బయటపడిందన్నారు. మునుగోడు ప్రజలు సోని గాంధీ ప్రతినిధిగా అసెంబ్లీకి పంపిస్తే కాంగ్రెస్ తో పేగు బంధాన్ని తెంపేసుకున్నారన్నారు. కాంగ్రెస్ ఆదరించికపోతే బ్రాందీ షాపుల్లో పని చేయడానికి కూడా పనికిరారని దుయ్యబట్టారు. నరేంద్ర మోడీ, కేసీఆర్ నాణేనికి బొమ్మ బొరుసులాంటి వారని రేవంత్ రెడ్డి విమర్శించారు.

Jyothi

Jyothi

Next Story