Revanth Reddy: ఐనవారికి ఆకుల్లో కానివారికి కంచాల్లో అంటే ఇదేనేమో!
Revanth Reddy: పంజాబ్‌లో మృతి చెందిన రైతుల కుటుంబాలకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం చేయడంపై టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.
Revanth Reddy: ఐనవారికి ఆకుల్లో కానివారికి కంచాల్లో అంటే ఇదేనేమో!
Revanth Reddy: పంజాబ్‌లో మృతి చెందిన రైతుల కుటుంబాలకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం చేయడంపై టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఐనవారికి ఆకుల్లో కానివారికి కంచాల్లో అంటే ఇదేనేమో! అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణలో రోజుకు ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఫాంహౌస్ గడప దాటి..ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించని కేసీఆర్ పంజాబ్ రైతులకు పరిహారం ఇచ్చారు. ఇందులో ఉన్న మర్మమేమిటో మన రైతన్నలకు అర్థం కాదనుకుంటున్నారా!'' అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేసీఆర్ పంజాబ్ పర్యటనకు సంబంధించిన పలు ఫొటోలను ఆయన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఇక్కడి రైతులకు కూడా కేసీఆర్ ఆర్థిక సాయం చేయాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.
Next Story




