కేబినెట్‌లో ధాన్యం కొనుగోలుపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి - రేవంత్‌

Revanth Reddy Demand to Clear Paddy Procurement Issue in Today Cabinet | Live News
x

కేబినెట్‌లో ధాన్యం కొనుగోలుపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి - రేవంత్‌

Highlights

Revanth Reddy: ధాన్యంపై కేంద్రం, రాష్ట్రాలు దొంగ నాటాకాలడుతున్నాయి...

Revanth Reddy: ఇవాళ జరిగే తెలంగాణ కేబినెట్‌ సమావేశంలో ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 24 గంటలలో రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి కొనుగోలును ప్రారంబించాలన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన వైఖరి తీసుకుని రైతులకు భరోస కల్పించకపోతే ఎక్కడికక్కడ మంత్రులను, టిఆర్ఎస్ నేతలను అడ్డుకుంటామని హెచ్చరించారు.

మద్దతు ధరలకు ధాన్యం కొనుగోలు చేపట్టాలని, రైతులకు లాభం జరిగేలా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బీజేపీ, టిఆర్ఎస్ లు ఆడుతున్న దొంగ నాటకాలు కట్టిపెట్టాలన్నారు. రైతుల నుంచి చివరి వరి గింజ వరకు కొనుగోలు చేయాలని, రైతులకు అన్యాయం జరిగితే కాంగ్రెస్ రైతుల పక్షాన పోరాటం చేసి వారికి అండగా ఉంటుందన్నారు రేవంత్ రెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories